ఎన్టీఆర్ 'సజీవ చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

AP: ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 'సజీవ చరిత్ర' పుస్తకం ఇవాళ విజయవాడలో ఆవిష్కృతం కానుంది. సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. విక్రమ్ పూల రచించిన ఈ పుస్తకంలో ఉమ్మడి APలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్టీఆర్ మళ్లీ సీఎంగా ఎలా తిరిగి వచ్చారో విశ్లేషించారని ఆయన వివరించారు.