పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
MHBD: నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ విద్యాసంస్థలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను పరీక్షించారు. అలాగే, పాఠశాలలో అందిస్తున్న సదుపాయాలు, సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.