ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
VZM: జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఐదో బెటాలియన్‌లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎం. సూర్యనారాయన మూర్తి (34) పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్నహత్య చేసుకున్నాడు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు.