దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన: వర్షిత్ రెడ్డి

NLG: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆదివారం అన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.