'బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం'
KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్య రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు తెలిపారు. సోమవారం యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ 3,32,205 కోట్లు కాగా అందులో 30% నిధులు విద్యకు కేటాయించాలని విద్యారంగా అభివృద్ధికి ఏర్పాటైన ప్రముఖ కొఠారి కమిషన్ చెప్పిందని, 10 శాతమే కేటాయించారని మండిపడ్డారు.