జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

KMM: SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్‌స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.