కుల్దీప్‌కు షాక్.. జట్టు నుంచి తొలగింపు
భారత టీ20 జట్టు సభ్యుడైన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అనూహ్యంగా షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న అతడిని, మరో రెండు టీ20 మ్యాచ్‌లు ఉండగానే టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నపలంగా జట్టు నుంచి తప్పించింది. సౌతాఫ్రికాతో జరిగే రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో అతడిని ఆడించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కుల్దీప్ భారత్‌కు పయాణం కానున్నాడు.