VIDEO: పోడు భూములకు రక్షణ కల్పించాలని ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు పోడు భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, పోడు భూములకు రక్షణ కల్పించాలని, దౌర్జన్యం చేస్తున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తామని పోలీసులు, చర్ల తహసీల్దార్ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు.