వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

MHBD: కేంద్రంలోని వర్షా ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో సందర్శించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు