షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధం

NLG: చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో బంగారుగడ్డ నుంచి నాంపల్లి వరకు రెండు వరుసల డబుల్ రోడ్డుకు నిర్మాణ పనులు నడుస్తున్నాయి. సోమవారం ఒక టిప్పర్ మట్టిలోడుతో వచ్చి అన్‌లోడ్ చేస్తుండగా పైన ఉన్న 33కేవీ కరెంట్ మెయిన్ లైన్‌ తీగలు తగలడంతో మంటలు చెలరేగి టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో టిప్పర్ డ్రైవర్ కరెంటు షాకు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.