హరీష్ రావుపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు

SDPT: నిరుద్యోగులపై ఎమ్మెల్యే హరీష్ రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని, TSPSCలో ఉద్యోగాలు అమ్ముకున్న ఘనత BRS నాయకులదని DCC ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ ఆదివారం విమర్శించారు. జాబ్ మేళాలో హరీష్ రావు కాంగ్రెస్ మంత్రులపై చేసిన ఆరోపణలు సిగ్గుచేటని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.