BREAKING: పాండ్యా దూరం.. టాస్ గెలిచిన ఢిల్లీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో DC, MI మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన DC మొదట బౌలింగ్ ఎంచుకుంది. చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరుజట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు పాండ్యా దూరం కావడంతో MI కెప్టెన్‌గా సూర్య వ్యవహరిస్తున్నాడు.