సోనో విజన్ స్టోర్ ఎదుట హమాలీల ఆందోళన
KMM: ఖమ్మం నగరంలోని సోనో విజన్ స్టోర్ వద్ద సీఐటీయూ కార్మిక సంఘం ఆందోళన చేపట్టింది. హమాలీ కార్మికుల సమస్యలను స్టోర్ యాజమాన్యం పరిష్కరించడం లేదని కార్మికులు ఆరోపించారు. స్టోర్ మేనేజర్‌ను సంప్రదించడానికి వెళ్లిన కార్మిక సంఘం నాయకులపై ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు వారు తెలిపారు. మేనేజర్ తీరును నిరసిస్తూ స్టోర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.