మాదిగ సంఘం నూతన కమిటీ ఎన్నిక

JN: పట్టణ కేంద్రంలో మాదిగ కుల సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఊడుగుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా గాదపాక రామచందర్, కోశాధికారిగా మల్లిగారి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు అన్నారు. ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.