విద్యార్థులతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం
NDL: ఆళ్లగడ్డలోని బాలయోగి గురుకుల విద్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థినులతో పాటు నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను భోజనం నాణ్యత, ప్రభుత్వ నిర్దేశిత మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థినిలకు సూచించారు.