జమ్మలమడుగు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంపు
కడప: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు మున్సిపాలిటీలో వార్డులు 25 నుంచి 32కు పెరిగినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. గతంలో 20 వార్డుల నుంచి 25కు పెంపు నిర్ణయం తీసుకున్నా అమలు కాలేదన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం 32 వార్డులుగా విభజించారన్నారు.