టాప్ 10లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

ADB: తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చోటు సంపాదించుకున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్ ద్వారా 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ 8వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ సేకరించినట్టు తేలిపారు.