ఆగస్టు 18న బీసీల ఛలో ఢిల్లీ: ఆర్. కృష్ణయ్య

HYD: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 18, 19 తేదీల్లో బీసీల ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. 18 బీసీ సంఘాలు, విద్యార్ధి, ఉద్యోగ, కుల సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.