కారు యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

KNR: మానకొండూరు మండలం అన్నారం, రాఘవపూర్ గ్రామాల మధ్య ఓ కారు కల్వర్టును అతివేగంగా ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. పచ్చునూరు గ్రామానికి చెందిన దాసారం నరసయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మానకొండూరుకు చెందిన కుండ్ర సంజూకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని కరీంనగర్ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.