రాంపూర్ తండాలో ఘనంగా దుర్గమ్మ పండుగ వేడుకలు
WGL: నెక్కొండ మండలం సూరిపల్లి సమీపంలోని రాంపూర్ తండాలో దుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... దుర్గమ్మ ఆశీస్సులతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు కలకాలం పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలన్నారు.