VIDEO: ఓటు వేసిన మాజీ మంత్రి
ADB: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జైనథ్ మండలంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, మండలంలోని దీపాయిగూడ గ్రామంలో మాజీ మంత్రి జోగు రామన్న తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు.