సర్పంచ్‌గా మోటం సమ్మవ్వ విజయం
KNR: మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామ నూతన సర్పంచ్ మోటం సమ్మవ్వ 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల పెద్దలు, ముఖ్యంగా గ్రామ యువతకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి సహకారంతో గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని సమ్మవ్వ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.