గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ప్రకాశం: పాడేరు నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ తమిళనాడులో విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జీఆర్పీ ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఒంగోలులోని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.96 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.