రోడ్డు ప్రమాదం.. అనాథలుగా మారిన చిన్నారులు
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. ఈ ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బండప్ప, లక్ష్మీ మృతి చెందగా.. వారి కుమార్తెలు భవాని, శివలీల ఒంటరయ్యారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని కన్నీళ్లు పెట్టించాయి.