'ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి'
SKLM: ఆముదాలవలస పురపాలక సంఘం పరిధిలో గృహ నిర్మాణ పథకానికి అర్హులైన 297 మందికి అనుమతి పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే కూన రవి కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వము కట్టుబడి ఉంది" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ హౌసింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు.