డ్రోన్ల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్
సరిహద్దుల మీదుగా డ్రోన్‌ల ద్వారా భారత్‌లోకి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్న పాక్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి నలుగురు సభ్యుల ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 అత్యాధునిక తుపాకులు, 92 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు టర్కీ, చైనాలో తయారైనవిగా గుర్తించారు.