వడ్డెర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవితను వడ్డెర కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ దేవళ్ల మురళి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వడ్డెర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందించి వడ్డెర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.