కడప కైఫీయత్తుల సజీవ దార్శనికుడు: కట్టా నర్సింహులు

KDP: కడప కైఫీయత్తుల సజీవ దార్శనికుడు కట్టా నరసింహులని ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు డాక్టర్ తవ్వా వెంకటయ్య అన్నారు. బుధవారం మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీ.శే. విద్వాన్ కట్టా నరసింహులు వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభకు రచయిత, చరిత్ర పరిశోధకులు బొమ్మీశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఓబయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.