మత్స్యకారులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
AP: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. వేట నిషేధ సమయంలో భృతిని రూ.20వేలకు పెంచాం. మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా మారిన వైసీపీ హయాంలో తెచ్చిన జీవో 217 మా ప్రభుత్వం రద్దు చేసింది. లక్షలాది మంది ఉపాధికి భరోసా కల్పించాం' అని తెలిపారు.