VIDEO: బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయానికి పోటెత్తిన భక్తులు
E.G: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు.