'గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి'

'గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి'

ASR: పీవీటీజీ గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం పలువురు గిరిజనులతో కలిసి పాడేరు ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపారు. పీఎం జన్ మన్ పథకంలో భాగంగా గిరిజన గ్రామాల్లో రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టాలని సూచించారు.