భారీగా పడిపోయిన పత్తి విక్రయాలు
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. నిన్నటి వరకు 400 పైగా క్వింటాల పత్తి అమ్మకానికి రాగా, నేడు 240కే పరిమితమయ్యా యి. గురువారం యార్డుకు 240 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,400, కనిష్ఠంగా రూ. 7,300 ధర లభించిందని మార్కెట్ అధికారులు తెలిపారు.