‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్న బీజేపీ చీఫ్

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ 'చాయ్ పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు స్థానికులతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.