'మే 5న కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా'
KNR: 2024 మార్చి నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మే 5న కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరాహార దీక్ష చేపడతారని రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి తెలిపారు. నేడు కరీంనగర్లో జరిగిన సన్నహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీపీఎఫ్, టీఎసీఎస్ఐ, జీఐఎస్, గ్రాట్యూటీ చెల్లించక ఇబ్బందులు పడుతున్నారన్నారు.