సర్పంచ్ లక్ష్మీపతి రెడ్డిపై కలెక్టర్ ప్రశంసలు

సర్పంచ్ లక్ష్మీపతి రెడ్డిపై కలెక్టర్ ప్రశంసలు

TPT: రేణిగుంట(M) విప్పమని పట్టెడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తిరుపతి అసిస్టెంట్ కలెక్టర్ సందీప్ రఘువంశ్ మంగళవారం సందర్శించారు. ఆధునిక సదుపాయాలతో నడుస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, ఉత్తమ సదుపాయాలతో కూడిన కేంద్రాన్ని తాను మొదటిసారి చూస్తున్నానని పేర్కొని సర్పంచ్ లక్ష్మీపతిని ప్రశంసించారు. అంగన్వాడీ, పాఠశాల సదుపాయాలను పరిశీలించి టీచర్ల కృషిని అభినందించారు.