ఆపదమిత్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఆపదమిత్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

HNK: ఆపత్కాలంలో సామాజిక బాధ్యతతో బాధితులకు అండగా నిలబడాలని మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ అన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్ర కార్యక్రమంలో భాగంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0870- 2958776 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.