విద్యతోనే మంచి భవిష్యత్: MLA వరదరాజులు
KDP: విద్యతోనే మంచి భవిష్యత్ ఉంటుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం అనిబిసెంట్ మున్సిపల్ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తాను ఇక్కడే చదువుకున్నానని తెలిపారు. అప్పటి గురువులను, పాత రోజులను గుర్తు చేసుకున్నారు. దేశాన్ని అబివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సింది విద్యార్థులు, యువతే అని అన్నారు.