'23న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలి'

SRD: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు అన్నారు. పుల్కల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో గురువారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.