'రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలి'

PPM: భామిని మండలం కీసర గ్రామంలో పాలకొండ మాజీ ఎమ్మెల్యే వి. కళావతి మంగళవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులుకు ఎరువులు అందక అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని కళావతి డిమాండ్ చేశారు. ప్రజల కోసం రైతు భరోసా కేంద్రాలకు వచ్చిన ఎరువుల స్టాకును కూటమి నాయకులు దొడ్డిదారుల్లో తరలించుకుపోతున్నారన్నారు.