'మదర్ థెరిస్సా ఆశయ సాధనకు పాటుపడాలి'

E.G: మదర్ థెరిస్సా ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని KVPS నాయకులు, CPM జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు పిలుపునిచ్చారు. మంగళవారం భారత రత్న, ప్రముఖ సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా నిడదవోలులో ఉన్న ఆమె విగ్రహానికి KVPS ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజానికి మదర్ థెరిస్సా చేసిన సేవలను కొనియాడారు.