ఇవాళ గిల్‌కు ఫిజికల్ టెస్ట్
సౌతాఫ్రికాతో రేపటి నుంచి గౌహతి టెస్ట్ జరగనుంది. ఈ క్రమంలో మెడ నొప్పితో బాధ పడుతున్న కెప్టెన్ గిల్ ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోనున్నాడు. ఇందులో పాస్ అయితే రేపటి టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. తొలి టెస్ట్ రెండో రోజు మెడనొప్పితో గిల్ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతను నిన్న ప్రాక్టీస్‌కి కూడా హాజరుకాలేదు.