బాణాసంచా పేలుడు ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
KKD: వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 27 మంది మృతిచెందగా.. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ వెంకటలక్ష్మీ అనే మహిళ మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరింది. ఘటనలో గాయపడి 9 మంది ఆసుపత్రిలో చేరగా.. 8 మంది మృతి చెందారు. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.