ప్రమాదాలకు కారణం ఈ ఇసుకే

కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆర్.అండ్.బీ ప్రధాన రహదారి పక్కనే ఇసుక గుట్టలు వేయడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ సమస్యపై పంచాయతీ, ఆర్.అండ్.బీ, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.