రాజంపేటలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య

రాజంపేటలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య

అన్నమయ్య: రాజంపేట సాయి నగర్‌కు చెందిన విద్యార్థిని (14) మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆదివారం పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైంది. తిరిగి ఇంటికి వచ్చి స్నానపు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.