VIDEO: రింగ్ రోడ్డులో ప్రమాద నివారణ చర్యలు పూర్తి..!
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డులో ఇంజనీరింగ్ అధికారుల బృందం ప్రమాద నివారణ చర్యలు పూర్తిచేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే నాగోల్, సికింద్రాబాద్, బోడుప్పల్ వైపు వెళ్లే మార్గాల్లో మీడియన్ల వద్ద ప్రత్యేకంగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా స్కైవాక్ మాత్రమే యూజ్ చేయాలని సూచిస్తున్నారు. మెట్రో పైనుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది.