ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
SKLM: పోలాకి మండలం ఈదులవలస పంచాయతీకి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో సోమవారం చేరారు. వారికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం పాలన నచ్చి తాము పార్టీలో చేరుతున్నట్లు చేరినవారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.