రోడ్డు భద్రతకు 'IRAD' యాప్ కీలకం: ఎస్పీ

రోడ్డు భద్రతకు 'IRAD' యాప్ కీలకం: ఎస్పీ

WNP: రోడ్డు ప్రమాదాల నివారణలో 'IRAD' యాప్ కీలకమని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ప్రమాద వివరాలను ఈ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా బాధితులకు త్వరగా ఎక్స్‌గ్రేషియా అందుతుందని పేర్కొన్నారు. డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదాలను అరికట్టి, రోడ్డు భద్రతను మెరుగుపరచవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు.