ఒంగోలులో శక్తి యాప్‌పై అవగాహన

ఒంగోలులో శక్తి యాప్‌పై అవగాహన

ప్రకాశం: ఒంగోలులోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం మహిళలకు శక్తి యాప్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో విద్యార్థులకు, మహిళలకు యాప్ గురించి వివరించి వారి ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో SOS బటన్ నొక్కితే నేరుగా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుందని, దీంతో పోలీసులు ఆపదలో ఉన్న మహిళలను రక్షించవచ్చని చెప్పారు.