మున్సిపల్ కమిషనర్‌పై ఫిర్యాదు

మున్సిపల్ కమిషనర్‌పై ఫిర్యాదు

RR: ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయకుండా అవమానించే విధంగా ప్రవర్తించారని మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ పనితీరుపై హిమాయత్ నగర్ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆదివారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. పనుల గురించి వెళ్లిన వారిని సైతం కమిషనర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.