VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలానికి ఎస్పీ

ఒంగోలు నగర సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలంలో పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, మృతుల వివరాలు పోలీసులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక కిమ్స్ వైద్యశాలకు తరలించారు.